BDK: దసరా పండుగ సందర్భంగా పాల్వంచ మండలంలోని జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. పండగ వేల అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభాలు జరుగుతాయని ఆనవాయితీ ప్రకారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడీ ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. భవాని మాలదారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.