ప్రకాశం: మహాత్మా గాంధీ సాధనకు నేటి యువత కృషి చేయాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. ఇవాళ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత మహాత్మా గాంధీని స్పూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.