VZM: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గురువారం బొబ్బిలి పట్టణం చీపురుపల్లి వీధిలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బేబినాయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ మహాత్ముడు చేసిన కృషి మరువలేనిదని, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటానికి ప్రధాన రూపశిల్పిగా నిలిచారన్నారు.