KMR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ వైద్యులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో వీధుల నిర్వహణపై వైద్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏఎన్ఎంతో పాటు, ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచాలని సూచించారు.