W.G: భీమవరం త్యాగరాజ భవనంలోని శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా లడ్డు లక్కీ డ్రిప్ నిర్వహించారు. ఇవాళ ఉదయం జరిగిన లక్కీ డ్రిప్‌లో పట్టణానికి చెందిన గుండు గిరి శ్రీవాసవీ మాత అమ్మవారి లడ్డును దక్కించుకున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు వారికి లడ్డును అందించి సత్కరించారు.