JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి, ఎస్సై ఉమా సాగర్ పాల్గొన్నారు.