VSP: దసరా రద్ది దృష్ట్యా విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు (08589/08590) నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. విశాఖలో అక్టోబర్ 3న రాత్రి 7.30కు బయలుదేరి అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అక్టోబర్ 4న రాత్రి 8 గంటలకు బయలుదేరి అక్టోబర్ 5న ఉదయం 11.45 గంటలకు విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.