ASF: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, రిసెప్షను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బాధితులకు సత్వర సేవలందించాలని సీఐ, ఎస్సైలకు చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు.