Agent Movie: బిగ్ సర్ప్రైజ్.. ఏజెంట్లో రామ్ చరణ్!
'ఏజెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
అఖిల్(Akhil) నటిస్తున్న ఏజెంట్ మూవీ(Agent Movie) నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అస్సలు ఊహించని విధంగా షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖిల్, చరణ్(Ramcharan) ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event) కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
వరంగల్‌లో జరిగిన ఏజెంట్(Agent Movie) ఈవెంట్‌కు నాగార్జున గెస్ట్‌గా వచ్చాడు. అయితే ఏజెంట్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మళ్లీ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు వినిపించింది. కానీ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కానుంది. దాంతో మేకర్స్ రామ్ చరణ్(Ramcharan) కోసం వేరే ప్లాన్ వేసినట్లు ఉన్నారు. ఏకంగా ఏజెంట్లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్టు హింట్ ఇచ్చేలా.. సాలిడ్ వీడియో రిలీజ్ చేశారు. Stay tuned…. #Dhruva x #Agent అంటూ.. చిన్న వీడియోని వదిలారు. ఇందులో ఏజెంట్‌ని.. ధృవ మీట్ అవబోతున్నట్లు చూపించారు. బ్యాక్ సైడ్ నుంచి రాంచరణ్ ని చూపిస్తూ.. ఏజెంట్ ఎక్కడున్నావు? అంటూ రాంచరణ్ పవర్ ఫుల్ వాయిస్ రివీల్ చేశారు. దీనికి పరిస్థితులు మరింత వైల్డ్‌గా మారుతున్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే అసలు మ్యాటర్ మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ఖచ్చితంగా చరణ్(Ramcharan) తో ఏజెంట్ ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే చరణ్, అఖిల్(Akhil) ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. థియేటర్ బాక్సులు బద్దలవడం ఖాయం. గతంలో చరణ్‌తో ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘ధృవ’ సినిమా తీశాడు. ఆ తర్వాత చరణ్, చిరంజీవి హీరోగా ప్రొడ్యూస్ చేసిన సైరానరసింహారెడ్డికి దర్శకత్వం వహించాడు. చరణ్‌తో సురేందర్ రెడ్డి మంచి బాండింగ్ ఉంది. దీంతో సురేందర్ రెడ్డి ఏజెంట్‌ను స్పై యూనివర్స్‌గా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా చరణ్ రాకతో ఏజెంట్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇంకొన్ని గంటల్లో దీని పై క్లారిటీ రానుంది.