టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి రాయలసీమలో ఊహించని షాక్ తగిలింది. ఆయనను నిరసనకారులు అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.
రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడంతో పాటు చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడంపై చంద్రబాబు పెదవి విప్పాలంటూ కామెంట్లు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబు నోరు విప్పాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కర్నూలు ప్రజలు నిరసన చేపట్టారు.
చంద్రబాబు పర్యటన భారీ సక్సెస్ అని ప్రచారం చేసుకుంటున్న ఎల్లో మీడియకు భారీ షాక్ అనే చెప్పాలి. చంద్రబాబుకు రాయలసీమలో ఎలాంటి ఇమేజ్ ఉందో సులువుగానే అర్థమవుతుంది. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబుపై ముద్ర పడిందంటే చంద్రబాబు పరువు ఒక విధంగా పోయినట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నిరసన కారులను ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను.. ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా.. నన్ను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయం.. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.