VSP: గాజువాక సమీపంలోని హరిజన జగ్గయ్యపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఈ సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటాయని, ట్రాక్‌పై తల, మొండెం వేరయ్యాయని తెలిపారు. ఇది ఆత్మహత్యగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.