JN: పాలకుర్తి పట్టణ కేంద్రంలో గుడివాడ అంగడి బజార్లో ఉంటున్న లక్ష్మీ (50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనాథ అయిన లక్ష్మీకి సేవ్ పాలకుర్తి ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. బండిపెల్లి మధు, దుంపల సంపత్, దేవసాని సురేష్‌లు పాల్గొన్నారు.