E.G: గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. గత రాత్రి గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన నేపథ్యంలో ఎమ్మెల్యే సంఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్త తీసుకోవాలన్నారు.