TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మంచి అవకాశమని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు తమ పార్టీ ‘బాకీ కార్డు’లను పంపిణీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చడం లేదని కేటీఆర్ ఆరోపించారు.