GNTR: నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యానికి కూటమి ప్రభుత్వం మాటలు పడాలా అని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ప్రశ్నించారు. 22వ డివిజన్లోని శ్రీనివాసరావుపేటలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం పగలగొట్టిన సైడ్ కాలవలను ఇప్పటివరకు పునర్నిర్మించకపోవడంతో, వాటి నుంచి వస్తున్న దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు నరకం చూస్తున్నారని ఆరోపించారు.