HYD: నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. భారీవర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపు.. వంతెనల మీద నుంచి ప్రవహిస్తున్న వరద.. దీనికితోడు దసరా సెలవులతో లక్షలాది మంది సొంతూళ్ల ప్రయాణాలు.. వాహనదారులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్కలు చూశారు. మలక్ పేట, చాదరాఘాట్, తదితర ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.