SKLM: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దమ్ము గోపాలకృష్ణపై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించినట్లు బాధితురాలు ఈనెల 16న ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.