»Telangana Amit Shah Tea Party Cancelled With Rrr Team In Hyderabad
RRR బృందానికి ఘోర అవమానం.. Party అని చెప్పి సమయం ఇవ్వని Amit Shah
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మొదటి నుంచి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గతంలో బండి సంజయ్ కుమార్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై ఆస్కార్ బరిలో నామినేషన్లు వేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపింది.
తెలంగాణ (Telangana) పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా (Amit Shah) పర్యటన చప్పగా సాగింది. చేవెళ్ల (Chevella) బహిరంగ సభకు హాజరవడానికి ముందు ఆస్కార్ (Oscar) సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బృందంతో ఆయన సమావేశమవుతారని వారం రోజులుగా ప్రచారం జరిగింది. సినిమా బృందంతో అమిత్ షా సమావేశం ఉంటుందని అధికారికంగా షెడ్యూలు కూడా ఖరారైంది. అయితే చివరి నిమిషంలో ఈ భేటీ రద్దయ్యింది. దీంతో ఆర్ఆర్ఆర్ బృందం చిన్నపోయింది.
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి అమిత్ షా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. గతంలో రామ్ చరణ్, చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్ తదితరులను వేర్వేరుగా కలుసుకున్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నితిన్ (Nithin), మిథాలీ రాజ్(Mithali Raj) భేటీ అయ్యారు. ఇటీవల ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా బృందాన్ని అభినందించాలని అమిత్ షా నిర్ణయించారు. తాజా పర్యటనలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో సమావేశం కావాలని భావించారు. ఈ మేరకు నోవాటెల్ హోటల్ లో తేనీటి విందుకు ఏర్పాట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan Teja), రాజమౌళి(SS Rajamouli), కీరవాణి (MM Keeravani), చంద్రబోస్‌తో (Chandrabose) పాటు విజయేంద్రప్రసాద్‌కు (Vijayendra Prasad) ఆహ్వానాలు పంపారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడైంది.
వీరితో సమావేశం అనంతరం గంటపాటు తెలంగాణ (Telangana) నేతలతో అమిత్ షా భేటీ అవుతారని ప్రచారం జరిగింది. అయితే ఆదివారం జరిగిన అమిత్ షా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందానికి అవకాశం ఇవ్వలేదు. కేవలం రాజకీయ కార్యక్రమాలకే సమయం ఇచ్చారు. చివరి నిమిషంలో తేనీటి విందు (Tea Party) రద్దవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని అవమానించారనే విమర్శలు మొదలయ్యాయి. అమిత్ షా భేటీ కోసం కొందరు సినీ ప్రముఖులు అప్పటికే నోవాటెల్ హోటల్ (Novotel Hotel)కు చేరుకుని.. వేచి ఉన్నారని.. ఆఖరి నిమిషంలో రద్దవడంతో వారు నిరాశతో వెనుదిరిగారని సమాచారం.
షెడ్యూల్ (Schedule) ఖరారు చేసి చివరి నిమిషంలో రద్దు చేయడమంటే తెలుగు సినీ పరిశ్రమను (Tollywood) అవమానించినట్లుగా భావించవలసి వస్తుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముందే సమయం ఖరారు చేసి.. అందరికీ ఆహ్వానాలు పంపి.. మరి వారితో సమావేశం కావడం దేనికి అర్థం అని నిలదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మొదటి నుంచి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గతంలో బండి సంజయ్ కుమార్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై ఆస్కార్ బరిలో నామినేషన్లు వేసే విషయంలో నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వివక్ష చూపింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు బదులు భారత ప్రభుత్వం ఓ గుజరాత్ సినిమాను ఆస్కార్ నామినేషన్లకు పంపిన విషయం తెలిసిందే. నాటి నుంచి కొనసాగుతున్న వివక్ష తాజాగా భేటీ రద్దవడానికి కారణం అదేనని చెప్పాల్సి వస్తోంది.