NLG: చిట్యాల కనకదుర్గమ్మ ఆదివారం శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కూడలిలో గల అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు పసుపు రంగు వస్త్రంలో కొలువు తీరారు. పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు, అర్చకులు పూజలో పాల్గొన్నారు.