మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సమస్యలు తీష్ట వేశాయి. కాలనీలో ఎటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు మురుగునీరు అంతా కూడా నడిరోడ్డుపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. దాంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి.