BDK: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్లోని నిధులను విడతలవారీగా మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో విడతకుగాను రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం రూ.1,034.42 కోట్ల మేర నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.