TPT: తడ మండలం చేనుగుంట కాలనీలో షార్ట్ సర్క్యూట్తో గిరిజనుడి ఈటిపాకుల నాగార్జున ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు కూలి పనికి వెళ్లి వచ్చేసరికి టీవీ, ఫ్రిజ్, బియ్యం సహా సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.