»Rahul Gandhi To Vacate Official Bungalow April 22nd Belongings Shifted To Mother Sonia Gandhis House
Rahul Gandhi: అధికార బంగ్లాను నేడు ఖాళీచేయనున్న రాహుల్ గాంధీ..!
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం తన అధికారిక బంగ్లా(Official Bungalow)ను ఖాళీ చేసే అవకాశం ఉంది. మరోవైపు అతని వస్తువులను అతని అధికారిక నివాసం నుంచి 10 జన్‌పథ్‌లోని అతని తల్లి సోనియా గాంధీ ఇంటికి ఇప్పటికే మార్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లా(Official Bungalow)ను ఈ రోజు ఖాళీ చేయనున్నారు. అధికారులకు బంగ్లా అప్పగించనున్నారు. 12 తుగ్లక్ రోడ్ లోని బంగ్లా నుంచి ఇప్పటికే సామాన్లను ఆయన ఖాళీ చేశారు. ఎంపీ హోదాలో ఆయనకు అధికారులు ఈ బంగ్లాను కేటాయించారు. ఇటీవల ఆయనపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బంగ్లాను ఈ నెల 22లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 14న రాహుల్ గాంధీ తన కార్యాలయం, కొన్ని వస్తువులను బంగ్లా నుంచి ఖాళీ చేశారు. ఇంకా కొన్ని సామాన్లు మిగిలి వుండగా వాటిని నిన్న రాత్రి ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.
రెండు దశాబ్దాలుగా ఆయన అదే బంగ్లాలో ఉంటున్నారు. రాహుల్ గాంధీ తన కార్యాలయాన్ని షిఫ్ట్ చేసినప్పటి నుంచి 10 జన్ పథ్ లోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఉంటున్నారు. అక్కడ తన తల్లితో కలిసి వుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
2019లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దానిపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 కింద ఆయనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది.