RR: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధార్ రెడ్డి గురువారం ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గడ్డిఅన్నారం డివిజన్‌కు చెందిన నిర్మలకు రూ. 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న నిర్మల కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఈ పథకం వరంలాంటిదని అన్నారు.