కృష్ణా: డీఎస్సీ ప్రభుత్వ ఉపాధ్యాయులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని తమ నియోజకవర్గ డీఎస్సీ-2025 విజేతలకు అపాయింట్మెంట్ లెటర్లు అందచేశారు. ఏటా డీఎస్సీ హామీ విస్మరించి వైసీపీ ప్రభుత్వం మాట తప్పినా, కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ అమలు చేసిందన్నారు.