ADB: ఈనెల 27న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించనున్న కొండ లక్ష్మణ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, బీసీ సామాజిక వర్గం, అన్ని వర్గాల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.