పంజాబ్ నేషనల్ బ్యాంకు రోజువారీ ATM నగదు విత్డ్రా పరిమితులను సవరించింది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై నగదు విత్డ్రా పరిమితిని 50 శాతం మేర తగ్గించింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఓ ప్రకటనలో పేర్కొంది. వినియోగదారుల భద్రత పెంచడం, సురక్షిత డిజిటల్ లావాదేవీలను ప్రొత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.