KDP: ఉప్పరపల్లి సాయి నగర్లో భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4 రోజు విజయదుర్గ అమ్మవారు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు అమర్నాథ్ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.