కోనసీమ: దేశంలో పేదరిక నిర్మూలన కోసం సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని ఆలమూరు ఎంపీడీఓ ఏ రాజు, రావులపాలెం పారా సంస్థ డైరెక్టర్ థామస్ పల్లిదానం అన్నారు. ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై మండల సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్లకార్డులను ప్రదర్శించారు.