PPM: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీపురం పట్టణంలో కొత్తవలస, వెంకంపేట గోరీల వద్ద దుర్గాలయంలో అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని సామూహిక కుంకుమ పూజలు చేశారు.