AP: తిరువూరు వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ‘నాది కాంది అడుక్కోను.. నాది అనుకుంటే వదులుకోను. అందుకే గుడిలో పట్టువస్త్రాలు లాక్కున్నాను. ఆరోజు గుడిలో జరిగిందేదో జరిగిపోయింది. ఎంపీగారు గంట ఆలస్యంగా గుడికి వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం నేనే పట్టువస్త్రాలు సమర్పించాలి. ఆలయ ఈవో మొదటి ఆహ్వానం నాకే ఇచ్చారు’ అని పేర్కొన్నారు.