»Air India Pilot Allows Woman Friend Into Cockpit Midair Dgca Initiates Probe
cockpitలోకి ఫైలట్ స్నేహితురాలు.. స్నాక్స్, లిక్కర్ తేవాలని ఫైలట్ హుకుం.. విచారణ
ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.
Air India pilot allows woman friend into cockpit midair, DGCA initiates probe
Air India pilot:ఎయిర్ ఇండియా ఫైలట్ (Air India pilot) ఒకరు నిబంధనలను అతిక్రమించాడు. తన స్నేహితురాలిని (friend) కాక్‌పిట్‌లోకి (cockpit) తీసుకొచ్చాడు. ఆమెకు రాచ మర్యాదలు చేయాలని సిబ్బందిని పురామయించాడు. అందుకు వారు నో అన్నారు. అంతేకాదు ఎయిర్ ఇండియాకు (air india) ఫిర్యాదు చేయడంతో.. డీజీసీఏ (dgca) విచారణ ప్రారంభించింది.
ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ నెల 3వ తేదీన ఎయిర్ ఇండియాకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో డీజీసీఏ (dgca) కమిటీతో విచారణ మొదలెట్టింది.
ఎయిర్ ఇండియా (air india) 915 విమాన పైలట్ ఈ రోజు ఆలస్యంగా డ్యూటీకి వచ్చాడు. విమానంలో (flight) గాలిలో ఉండగానే బిజినెస్ క్లాస్‌లో (business class) ఖాళీ ఉందా అని సిబ్బందిని అడిగాడు. లేదని చెప్పడంతో.. ఎకానమీలో ప్రయాణిస్తోన్న తన ఫ్రెండ్‌ను కాక్ పిట్లోకి (cockpit) తీసుకురావాలని కోరాడు. పిల్లో తెచ్చివ్వాలని హుకుం జారీ చేశాడు. ఫస్ట్ అబ్జర్వర్ సీటులో కూర్చొబెట్టి.. ఆల్కహాల్ (liquor), స్నాక్స్ (snacks) తీసుకురావాలని కోరాడు. వాటిని తీసుకొచ్చేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో సిబ్బందిపై అరిచి.. నానా గోల చేశాడట.
వాస్తవానికి కాక్ పిట్లోకి (cockpit) బ్రీత్ ఆనలైజర్ టెస్ట్ పూర్తి చేసుకున్న వారిని అనుమతిస్తారు. ఆ పైలట్ ప్రవర్తనతో విమానంలో ప్రయాణించే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఫైలట్ ప్రవర్తనతో సాంకేతిక, భద్రతా అంశాలను పరిశీలిస్తున్నామని డీజీసీఏ పేర్కొంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.