KMM: ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ప్రముఖ వేద పండితుడు రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిపారు.