Ambati Rayudu: జగన్ పై ప్రశంసలు.. వైసీపీలోకి అంబటి రాయుడు?
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. రాజకీయాల్లో తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. క్రికెట్ కి పూర్తిగా వీడ్కోలు పలికి... రాజకీయాల్లో స్థిరపడాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
టీమిండియా క్రికెటర్ అంబటి రాంబాబు(Ambati Rayudu).. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానంటూ ప్రకటించేశాడు. అయితే… ఏ పార్టీలో చేరతాడా అనే సందేహం ఉండేది. ఇప్పుడు ఆ సందేహానికి పులిస్టాప్ పడింది. ఆయన వైసీపీ(YSRCP)లో చేరతారంటూ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ జనాల్లోకి వచ్చేలా ఆయనే స్వయంగా ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. తాను వైసీపీలో చేరుతున్నానని చెప్పకపోయినా… సీఎం జగన్(CM jagan)పై ప్రశంసలు కురిపించాడు. జగన్ గూటికే చేరేందుకే ఆయన పై ప్రశంసలు కురిపించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్(ap cm jagan) స్పీచ్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘గ్రేట్ స్పీచ్.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు మీ మీద పూర్తి నమ్మకం, ఆత్మ విశ్వాసంతో ఉన్నారు’ అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అంబటి త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ట్వీట్ తో ఆయనకు పాజిటివిటీ కంటే.. నెగిటివిటీ ఎక్కువగా వస్తుండటం గమనార్హం. క్రికెటర్.. క్రికెట్ ఆడుకోక.. రాజకీయాలు అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు.
మరో వైపు గుంటూరుకు చెందిన అంబటి రాయుడు(Ambati Rayudu) కుటుంబానికి స్థానికంగా మంచి పేరు ఉంది. అంబటి తాత కూడా గ్రామ సర్పంచ్ గా పని చేశారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత అంబటి రాయుడు పూర్తిగా క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నాడని, ఆ నెక్ట్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.