»Haryana Girls Dont Go To Oyo Room To Perform Pooja Says Renu Bhatia
అమ్మాయిలు Oyo Roomకు వెళ్లేది పూజలు చేయడానికి కాదు: మహిళా కమిషన్ చైర్ పర్సన్
విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
యువత పెడదారిన పట్టేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది ఓయో రూమ్ (Oyo Room)లు. అమ్మాయి అబ్బాయిలు విచ్చలవిడిగా పెళ్లి కాకుండానే శారీరకంగా కలిసేందుకు ఈ ఓయో రూమ్ లు ఉపయోగపడుతున్నాయి. ఇదే విషయాన్ని ఓ మహిళా కమిషన్ చైర్ పర్సన్ (Haryana Women’s Commission) తెలిపారు. ‘అమ్మాయిలు ఓయో హోటళ్లకు పూజలు (Pooja) చేసేందుకు వెళ్లరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు చెడు దారిన పడుతున్నారని ఆమె పరోక్షంగా అంగీకరించారు. అయితే వెళ్లేముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా (Renu Bhatia). రాష్ట్రంలోని కైతల్ (Kaithal)లోని ఆర్కేఎస్ డీ (RKSD) కళాశాలలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘లైంగిక వేధింపుల కేసుల్లో చాలా వరకు బాలికలు బాధ్యులుగా మారుతున్నారు. అమ్మాయిలు ఓయో రూమ్ కు వెళ్లేది హారతి ఇవ్వడానికి కాదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లేముందు.. అక్కడకు వెళ్లాక మీకు హాని జరగవచ్చు అనేది గుర్తుంచుకోవాలి’ అని సూచించారు.
‘సహజీవనం (Dating) చట్టంలో మార్పులు తీసుకురావాలి. సహజీవనం విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court of India) జారీ చేసిన నిబంధనల వల్ల మహిళలకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో మహిళా కమిషన్ పరిధి చాలా తక్కువగా ఉంది. లైంగిక దాడులు జరగడానికి మహిళలు కూడా కారణం’ అంటూ రేణు భాటియా వ్యాఖ్యానించారు. ఇలా పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు (Fact) చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. అయితే తాను ఈ వ్యాఖ్యలు సద్దుదేశంతోనే చేసినవని రేణు భాటియా వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని స్పష్టం చేశారు.