»Tata Ipl 2023 Delhi Capitals Beat Kkr Won By 4 Wickets In Arun Jaitley Stadium
IPLలో ఢిల్లీ బోణీ.. స్వల్ప స్కోర్ కు పోరాడిన David Warner సేన
స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
వరుసగా ఐదు మ్యాచుల్లో పరాజయం.. ఆరో మ్యాచ్ లోనైనా సత్తా చాటి ఐపీఎల్ (TATA IPL 2023)లో తమదో జట్టు ఉందనే నిరూపించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తండ్లాడింది. వరుస ఓటముల తర్వాత వార్నర్ సేన (David Warner) విజయం సాధించగా.. కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఓటముల్లో హ్యాట్రిక్స్ సాధించింది. ఉత్కంఠగా సాగిన పోరులో కోల్ కత్తాపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్-16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల ఖాతా తెరిచింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Stadium) ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ వర్షం కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జేసన్ రాయ్ (Jason Roy) (39 బంతుల్లో 43: 5 ఫోర్లు, ఒక సిక్స్), రసెల్ (Russel) (31 బంతుల్లో 38 నాటౌట్: ఒక ఫోర్, 4 సిక్సర్లు) చేసి జట్టుకు కొంత స్కోర్ అందించారు. ఇక మిగతా వారు వచ్చినట్టు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోయారు. గత మ్యాచ్ లో సెంచరీవీరుడు వెంకటేశ్ అయ్యర్ డకౌట్ కాగా, లిటన్ దాస్ (4), నితీశ్ రానా (4), మణిదీప్ సింగ్ (12), రింకూ సింగ్ (6), సునీల్ నరేన్ (4), అనుకూల్ రాయ్ (0), ఉమేశ్ యాదవ్ (3), వరుణ్ చక్రవర్తి (1) రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ చేరారు. కోల్ కత్తాను ఢిల్లీ బ్యాటర్లు స్కోర్ రాబట్టకుండా పటిష్ట బౌలింగ్ వేశారు. ఇషాంత్ శర్మ (2/19), అన్రిచ్ నోర్ట్జే (2/20), అక్షర్ పటేల్ (2/13), కుల్దీప్ యాదవ్ (2/15) తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీసి భారీ స్కోర్ ఇచ్చాడు. వీది దీటైన బౌలింగ్ కు ఢిల్లీ 127 పరుగులకు పరిమితమైంది.
స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 57: 11 ఫోర్లు) ఆఖరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మనీష్ పాండే (21), అక్షర్ పటేల్ (19) (Axar Patel) ఛేదనలో వార్నర్ కు తోడుగా నిలిచారు. పృథ్వీ షా (13), మిచెల్ మార్ష్ (2), ఫిల్ సాల్ట్ (5), హకీమ్ ఖాన్ (0) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలర్లు ఆదుకుంటారని భావించారు. స్కోర్ చేయకుండా నియంత్రించారు కానీ స్వల్ప స్కోర్ కావడంతో ఢిల్లీ సునాయసంగా చేధించింది. వరుణ్ చక్రవర్తి (2/16), అనుకూల్ రాయ్ (2/19), నితీశ్ రానా (2/17) తలా రెండు వికెట్లు పడగొట్టారు.