SRD: బొల్లారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం మార్నింగ్ వాకర్స్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా గ్రౌండ్ నలుమూలల పోగైన చెత్తాచెదారాన్ని చీపుర్లతో శుభ్రం చేసి తొలగించారు. స్వచ్ఛత పాటిస్తేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పలువురు వాకర్స్ అభిప్రాయపడ్డారు.