MHBD: పట్టణంలో త్వరలో ‘లంబాడీల ఆత్మగౌరవసభ’ను నిర్వహించనున్నారు. ఈ నిర్వాహణకు డిఎస్ఎప్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ తన వంతుగా రూ.2 లక్షలను విరాళంగా అందజేసారు. లంబాడీల హక్కులు, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు లంబాడి సోదరులు తెలిపారు. విరాళం ఇచ్చిన వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు.