KNR: హుజూరాబాద్ పట్టణం విద్యానగర్లోని కిరణా షాప్ సమీపంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపు యజమాని సంతోష్ తన మారుతి ఆల్టో కారును తీసేందుకు వెళ్లగా అప్పటికే అందులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.