తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్… వైరల్ గా మారాయి.
అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ కౌరవ సభలా ఉందని, దాన్ని గౌరవ సభను చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. అసెంబ్లీ వేదికగా తాను చేసిన శపథం గురించి చంద్రబాబు గుర్తు చేసారు. పార్టీని గెలిపించి ..తనను సీఎం గా అసెంబ్లీకి పంపితే సరే అని, లేదంటే ఇదే తన చివరి ఎన్నిక అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని, దేశంలో మూడు రాజధానులున్న రాష్ట్రం ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు వేయలేని సీఎం మూడు రాజధానులు ఎలా కడతారని విమర్శించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకోవడానికి భూమి ఇచ్చారని ఇళ్లన్నీ కూల్చివేశారని, ఇలాంటి రాజకీయాలను ఏమనాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.