తూ.గో: గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. 15 రోజుల క్రితం పోలవరం జిల్లాలో కలకలం రేపిన పులి ఇప్పుడు ఇక్కడ సంచరిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు అడవి వైపు ఎవరూ వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. పాదముద్రలను బట్టి పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.