Ponguleti : మే 5న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న పొంగులేటి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మే 5వ తేదిన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మే 5వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasareddy) కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకోనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్ష(Nirudyoga nirasana deeksha)ను చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ప్రియాంక(Priyanka) రానుంది. ఆమె సమక్షంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్(BRS)పై పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సభలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. తన మనసులోని మాటను ప్రజల సమక్షంలో ఉంచారు. కేసీఆర్ (KCR)పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పొంగులేటి(Ponguleti)కి తోడుగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) నిలిచారు. వీరిద్దరినీ బీఆర్ఎస్(BRS) సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పొంగులేటి, జూపల్లి ఇద్దరూ ఏ పార్టీలో చేరుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ కార్యకర్తలు కూడా 90 శాతం మంది కాంగ్రెస్(Congress) లో చేరాలని చెప్పినట్లు సమాచారం.
సన్నిహితుల సమక్షంలో పొంగులేటి(Ponguleti) మే 5వ తేదిన నిరుద్యోగ దీక్ష(Nirudyoga Deeksha)లో భాగంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) జెండా కప్పుకోనున్నారు. పొంగులేటి చేరికతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ వర్గంలో మరింత బలం పెరగనుంది. దీంతో బీఆర్ఎస్ (BRS)కు గట్టి దెబ్బ తగలనుంది. ఇదే టైంలో కర్ణాటకలో ఏవిధంగా జరిగిందో అదేవిధంగానే ముందస్తుగా తెలంగాణ(Telangana)లో 60 సీట్లను జూన్ లోనే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. బూత్ స్థాయిలో ప్రచారం చేస్తూ ఓటర్లను కలిసి పార్టీని సభ్యులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది.