ఎలాన్ మాస్క్ సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) గురువారం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మిషన్ కోసం రూపొందించిన నెక్ట్స్ జనరేషన్ రాకెట్ స్టార్ షిప్ ను పరీక్షించింది. అయితే ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి గుమిగూడిన ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్యలోనే రాకెట్ పేలిపోయింది.
రాకెట్ దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆకాశం వైపు దూసుకుపోయిన తర్వాత అయితే రాకెట్(rocket)నుంచి బూస్టర్‌ను వేరు చేయడంలో విఫలమైనట్లు కనిపించింది. ఆ క్రమంలో బూస్టర్లోని 33 ఇంజన్లలో కొన్ని మండకుండా కనిపించాయి.
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్(starship) ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్. ఏప్రిల్ 20న టెక్సాస్‌లోని బోకా చికా నుంచి అంతరిక్షానికి దాని మొదటి టెస్టును నిర్వహించారు. చంద్రుడు, అంగారక గ్రహం వెలుపలకు వ్యోమగాములను పంపడానికి రూపొందించబడిన తదుపరి తరం రాకెట్.