ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(chandrababu naidu) పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల(tirumala)లో నారా, నందమూరి అభిమానుల(fans) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ భక్తుడు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(chandrababu naidu) పుట్టినరోజు సందర్బంగా నందమూరి, నారా అభిమానులు(fans) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నందమూరి, నారా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయినా ఇరు కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరుమల(tirumala) శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం అనవాయితీగా వస్తోంది.
అందులో భాగంగానే ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు (టీటీడీ ఎక్స్ బోర్డ్ మెంబర్) కుటుంబ సభ్యులు, తెదేపా రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, అభిమానులు, టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలో ఆలయం వద్ద ఉన్న అఖిలాండం దగ్గర 774 కొబ్బరికాయలు(774 coconuts) కొట్టి, 7 కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించే అవకాశాన్ని ప్రసాదించాలని శ్రీనివాసుడిని వేడుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబునాయుడుపై ఉండాలని ఎన్టీఆర్ రాజు, శ్రీధర్ వర్మ, భాస్కర్ వర్మ తదితరులు స్వామిని ప్రార్థించారు.