HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్ రావుల సదానందం ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సదానంద మృతితో కాజీపేట పట్టణంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నివాళులర్పించారు.