బీహార్ సీఎం నీతీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో.. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో 2005 నుంచి బీహార్ రాజకీయాలను శాసించిన నితీష్ శకం ముగియనుంది. మరోవైపు జేడీయూ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. నీతీష్ లేని జేడీయూను బీజేపీ ఎలా డీల్ చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, నీతీష్ కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి.