WNP: నోటీసుల పేరుతో పోలీసుల వేధింపులు ఆపాలని గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఏదుల మండలం గొల్లపల్లి గేటు వద్ద రిజర్వాయర్ నిర్మించోద్దని చేస్తున్న నిరసన దీక్ష గురువారానికి 67వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణంతో 1200 ఎకరాల సాగు భూమి నీట మునిగి వందలాది రైతులు జీవనాధారం కోల్పోతారన్నారు.