KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె రాముడు భార్య వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు.