జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పవన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా… తాజాగా.. మంత్రి బొత్స సత్య నారాయణ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్.. తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి ఫిర్యాదుచేయడం పై ఘాటుగా స్పందించారు.
సినిమా నటుడు వచ్చాడని చూసేందుకు వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని మంత్రి ప్రశ్నించారు. తేల్చేస్తా, తేల్చేస్తా అంటున్నావు కదా…ఏం తేల్చేస్తారు ఆయన పవన్ ను ప్రశ్నించారు. నువ్వు చెప్పేదంతా ప్రజలు నమ్మడానికి నీవేమైనా యుగపురుషుడివా అని ప్రశ్నించారు. పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించిన ఆయన ఆరోపణలతో ప్రజల్నిమభ్యపెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అసలు గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని ఇండ్లు కట్టించారు అని ఎప్పుడైనా ప్రశ్నించావా అని ఆయన పవన్ ని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలని వైఎస్ఆర్ ప్రయత్నించారు, ఇప్పుడు తండ్రి బాటలోనే జగన్ సాగుతున్నారు అని బొత్స అన్నారు.
పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామన్న ఆయన జగనన్న కాలనీలకు రూ.3 వేలు కోట్లు ఖర్చు పెడితే రూ.15వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని మంత్రి బొత్స అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడారన్న ఆయన అసలు జనసేన రాజకీయపార్టీ కాదని దాన్ని తాను పార్టీగా కూడా చూడడం లేదని అన్నారు.