»Cm Jagan Met Sajjala Ramakrishna Reddy And Yv Subba Reddy
Sajjala, yv subbareddyతో సీఎం జగన్ భేటీ.. వివేకా హత్య కేసు పరిణామాలతో ప్రాధాన్యం
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.
CM Jagan met sajjala Ramakrishna reddy and yv subba reddy
CM Jagan met sajjala:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (Viveka) హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నెల 30వ తేదీ లోపు కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు (supreme court) డెడ్ లైన్ విధించడంతో ఎంక్వైరీ స్పీడప్ చేసింది. ఇటీవల అవినాశ్ రెడ్డి (avinash reddy) ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని (uday kumar reddy) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) నిన్న అరెస్ట్ చేసింది. మధ్యాహ్నం విచారణకు రావాలని అవినాష్ రెడ్డిని (avinash reddy) మరోసారి స్పష్టంచేయగా.. పులివెందుల నుంచి హైదరాబాద్ బయల్దేరారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy), వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy), ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో (chevireddy bhaskar reddy) భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు.. తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ రోజు ఉదయం పులివెందులలో (pulivendula) అవినాష్ రెడ్డిని (avinash reddy) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. సమావేశంలో ఆయన కూడా పాల్గొనడంతో.. వివేకా హత్య పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలిసింది.
వివేకానంద హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరికి (dastagiri) సంబంధించి భాస్కర్ రెడ్డి (bhaskar reddy) , అవినాష్ రెడ్డి (avinash reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. అతనిని అంత ఫ్రీగా ఎలా వదిలేస్తారని, అతను చెప్పిన అంశాల ఆధారంగా తమకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాష్ (avinash) పిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది.